Friday, May 3, 2024

వెదర్ అలర్ట్ః ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆదివారం నాటికి తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి, దక్షిణ ఒడిశాలోని గోపాల్‌పూర్‌, ఏపీలోని విశాఖపట్నం మధ్య… కళింగపట్నానికి సమీపాన తీరం దాటుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో శనివారం నుంచి కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఆదివారం అక్కడక్కడా అతి భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోస్తా తీరం వెంబడి గంటలకు 50-60 కి.మీ.వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండిః ఆ గాత్రం మధురం.. గాన గంధర్వుడికి ఘన నివాళి

Advertisement

తాజా వార్తలు

Advertisement