Sunday, April 28, 2024

Railway Alert: రైల్వే ప్ర‌యాణీకులు అల‌ర్ట్… విజయవాడ మీదుగా వెళ్లే ప‌లు రైళ్లు ర‌ద్దు…

ప్ర‌యాణీకులకు రైల్వేశాఖ షాకిచ్చింది. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాలకు నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

ఫిబ్రవరి 7 నుంచి మార్చి 27 వరకు విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (08579), ఫిబ్రవరి 8 నుంచి మార్చి 28 వరకు సికింద్రాబాద్‌-విశాఖపట్నం (08580), ఫిబ్ర వరి 5 నుంచి మార్చి 25 వరకు విశాఖపట్నం-తిరుపతి (08583), ఫిబ్రవరి 6 నుంచి మార్చి 26 వరకు తిరుపతి-విశాఖపట్నం (08584), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు విశాఖపట్నం-బెంగళూరు (08543) ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్‌ 1 వరకు బెంగళూరు-విశాఖపట్నం (08544), ఫిబ్రవరి 3 నుంచి మార్చి 30 వరకు భువనేశ్వర్‌-తిరుపతి (02809), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు తిరుపతి-భువనేశ్వర్‌ (02810), ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్‌ 29 వరకు పాట్నా-సికింద్రాబాద్‌ (03253), ఫిబ్రవరి 7 నుంచి మే 1 వరకు హైదరాబాద్‌-పాట్నా (07255), ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్‌ 26 వరకు సికింద్రాబాద్‌-పాట్నా (07256), ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్‌ 25 వరకు ధనాపూర్‌-సికింద్రాబాద్‌ (03225), ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్‌ 28 వరకు సికింద్రాబాద్‌-ధనాపూర్‌ (03226), ఫిబ్రవరి 7 నుంచి ఏప్రిల్‌ 28 వరకు బెంగళూరు-ధనాపూర్‌ (03242) రైళ్లను పొడిగించినట్లు అధికారులు తెలిపారు.

విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్‌ (విజయవాడపశ్చిమ): సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలోని పలు సెక్షన్‌లలో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా విజయవాడ డివిజన్‌ మీదుగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 2న నర్సాపూర్‌-హుబ్లీ (17225), ఫిబ్రవరి 3న హుబ్లీ-నర్సాపూర్‌ (17226), హుబ్లీ-గుంతకల్లు (07337), గుంతకల్లు-హుబ్లీ (07338), బల్గెవి-కాజీపేట (07335), ఫిబ్రవరి 4న కాజీపేట-బల్గెవి (07336) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement