Thursday, July 25, 2024

Protest – రేవంత్ ఇంటి వ‌ద్ద గురుకుల టీచ‌ర్ల నిర‌స‌న

హైద‌రాబాద్ – జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన తెలిపారు. మోకాళ్లపై నిలబడి తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అలాగే జీతాలు రావట్లేదని సీఎం ఇంటి వద్ద నర్సింగ్ స్టాఫ్ నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

గాంధీ భ‌వ‌న్ ముందు కూడా….

గాంధీభవన్ దగ్గర ఏఈఈ అభ్యర్థులు నిరసన చేపట్టారు. డాక్యుమెంటేషన్ జరిగి నెలలు గడుస్తున్నా తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అభ్యర్థులు వాపోయారు. మంత్రులకు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థుల ఆవేదన వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే ఇవాళ గాంధీ భవన్ దగ్గర మోకాల్ల మీద కూర్చొని ఏఈఈ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. మార్చ్ లో 1:2 రేషియోలో అభ్యర్థులను కమిషన్ సెలెక్ట్ చేసింది. డాక్యుమెంటేషన్ జరిగి మూడు నెలలు గడిచినా కమిషన్ అపాయింట్మెంట్ లేటర్లు ఇవ్వలేదని అభ్యర్థులు వాపోయారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement