Sunday, April 21, 2024

ఒంగోలు లో ఆత్మీయ సమావేశం.. జ‌డ్పీటీసీల‌కు ప్ర‌త్యేక గ‌దులు: వెంకాయమ్మ

ఒంగోలు, (ప్రభ న్యూస్‌) : జిల్లాలోని జడ్పీటీసి సభ్యులతో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా జడ్పీటీసీ సభ్యులు తమ పరిధిలో వున్న సమస్యలు, మండల కేంద్రాలలో మండల పరిషత్‌ కార్యాలయాల్లో జడ్పీటీసీలకు గౌరవ ప్రదమైన విధంగా రూం కేటాయిస్తే బాగుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ఈ సమస్యను జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకె ళ్ళి జడ్పీటీసీ సభ్యులందరికీ మండల పరిషత్‌ కార్యాలయంలో వసతిని బట్టి రూం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.

అవసరం అయితే ప్రతి మండల పరిషత్‌ కార్యాలయంలో రూ. 5 లక్షల నిధులు కేటాయించి రూంలు జడ్పీ నిధులతో కట్టిష్టామని హామీ ఇచ్చారు. మండల కేంద్రాలలో సమస్యలను వచ్చే జనరల్‌ బాడీ సమావేశంలో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగినది. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్లు అరుణ, సజ్ఞానమ్మ, జిల్లాలోని జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement