Monday, May 6, 2024

చెరువులో విషప్రయోగం..చేప పిల్ల‌లు మృతి

ఉదయగిరి మండలం అయ్యవారిపల్లి పంచాయతీ పరిధిలోని దేకూరుపల్లి గ్రామంలోని కోమటి వారి కుంట చెరువులో విషప్రయోగం చేయడంతో చేపపిల్లలు మృతి చెందాయి. నెల్లూరులోని కొల్లపూడి గిరిజన కాలనీకి చెందిన ఇరగా వెంకటేశ్వర్లు, ఉదయగిరి మండలం బండగాని పల్లికి చెందిన ఇర్లా వెంగయ్య అనే వ్యక్తులు ఈ చెరువును జి.అయ్యవారిపల్లి గ్రామ పంచాయతీ ద్వారా లీజుకు తీసుకుని లక్ష చేపపిల్లలను 25 రోజుల క్రితం వదిలారు. వాటికి పోషకాహారం వేసేందుకు బుధవారం లీజు దారులు చెరువు వద్దకు వెళ్లగా చెరువులోని చేపలు మొత్తం చనిపోయాయి.

దీంతో చనిపోయిన చేప పిల్లలను ల్యాబ్ లో పరీక్ష చేయించగా విష ప్రయోగంతో చనిపోయినట్లు నిర్ధారణ అయింది. బండగాని పల్లి పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి తమను పది రోజుల క్రితం బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడని, తాము అతనికి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించగా అతనే చెరువులో విష ప్రయోగం చేసి ఉంటాడని బాధితులు ఉదయగిరి పోలీస్ స్టేషన్ లో గురువారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఈ విష ప్రయోగం కారణంగా తమకు దాదాపు రూ. 8 లక్షల 60 వేలు నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ గిరిబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement