Monday, April 15, 2024

AP: పవన్‌ ఓ అనైతిక రాజకీయవేత్త – మంత్రి అంబ‌టి..

తాడేపల్లి: రాజకీయాల్లో పవన్‌ ఓ అనైతిక రాజకీయవేత్త అంటూ ఘాటు విమర్శలు చేశారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. గుంటూరులో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో పొత్తులపై బీజేపీ నాయకత్వంతో చీవాట్లు తిన్నానన్న పవన్‌కు కౌంటరిస్తూ ..’పవన్‌ కల్యాణ్‌ మాటలు చిత్రంగా, ఆశ్చర్యకంగా ఉన్నాయ‌న్నారు.

పవన్‌ లాంటి అనైతిక రాజకీయవేత్త ఈ రాష్ట్రంలోనే లేడంటూ ఫైర్ అయ్యారు. ఒక పార్టీతో పొత్తులో ఉండి మరో పార్టీతో రాజకీయం చేస్తున్నారంటూ మండి ప‌డ్డారు. ఓట్లు కొనుక్కోకూడదని చెగువేరాలాగా పవన్‌ కాకమ్మ కథలు చెప్పార‌ని, ఇప్పుడు మళ్లీ మాట మార్చి ఓట్లు కొనుక్కోమంటూ తన కేడర్‌కు పవన్‌ లైసెన్స్‌ ఇచ్చారంటూ దుయ్య‌బ‌ట్టారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement