Monday, February 26, 2024

శ్రీశైలం అన్నసత్రానికి రూ.కోటి విరాళమిచ్చిన టీ.జీ భరత్

కర్నూలు శ్రీశైలంలోని అన్నసత్రానికి టీజీవి సంస్థల జూనియర్ చైర్మన్ టి.జి భరత్ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. శ్రీశైలంలోని మల్లికార్జున అన్నసత్ర సంఘం టి.జి లక్ష్మీ వెంకటేష్ భవన్ ను కొత్తగా నిర్మించారు. ఇందులో 150 గదులతో డీలక్స్ రూములను భక్తుల సౌకర్యార్థం నిర్మించారు. ఈ అన్నసత్రాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి వెంకటేష్ కుటుంబ సమేతంగా కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో టి.జి భరత్ మాట్లాడుతూ ఈ అన్నసత్రానికి ఇప్పటికే రూ. 50 లక్షలు విరాళమిచ్చామని.. ఇప్పుడు మరొక యాబై లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రూ. 50 లక్షల చెక్కును సత్రం నిర్వాహకులకు అందజేశారు.

ఆర్యవైశ్యులకు ఎలాంటి సహకారం కావాలన్నా మా టీజీవీ సంస్థల తరుపున ఎప్పుడూ ముందుండి సహకారం అందిస్తున్నట్లు టీజీ వెంకటేష్, టీజీ భరత్ లు అన్నారు. అన్నసత్రానికి అడగకుండానే విరాళమిచ్చినందుకు టీజీ వెంకటేష్, టీజీ భరత్ లకు సత్రం నిర్వాహకులు క్రుతజ్నతలు తెలిపారు. అనంతరం వీరిని సత్రం నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిజి కుటుంబ సభ్యులు, అన్నసత్రం అధ్యక్షులు శ్యామ్ సుందర్, ఆర్యవైశ్య నాయకులు ఇల్లూరు లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement