Wednesday, May 15, 2024

మ‌రోసారి జ‌గ‌న్ పై ప‌ట్టాబి విమ‌ర్శ‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేతలపై టీడీపీ నేత పట్టాభిరామ్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలంటూ గెజిట్‌ నోటిషికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. లే అవుట్ల విషయంపై స్పందించిన పట్టాభి.. లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలని తీసుకువచ్చిన కొత్త నిబంధన మరో మోసమని ఆయన అన్నారు. పేదల ఇళ్ల‌ కోసం ఇప్పటికే 68 వేల ఎకరాలు సేకరించారన్నారు.
ఇప్పుడు లేఅవుట్ల నుంచి అదనంగా వెయ్యి ఎకరాలు ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. సేకరించిన భూమినే ఇంకా పేదలకు పంచలేదని, కొత్తగా గెజిట్‌ నోటిషికేషన్‌ ఇవ్వాల్సిన అవసరమేంటని ఆయన అన్నారు. ఈ ముసుగులో ఏటా రూ.2500 కోట్లు కొట్టేయడానికే జగన్‌ అండ్‌ కో సిద్దమయ్యారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement