Sunday, April 28, 2024

జ‌గ‌న్ కు చంద్ర‌బాబు సెల్ఫీ ఛాలెంజ్….

నెల్లూరు – సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నెల్లూరులో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సందర్శించిన టీడీపీ అధినేత టిడ్కో ఇళ్ల ముందు సెల్ఫీ దిగి సీఎం జగన్‌కు ఛాలెంజ్ విసురుతూ ట్వీట్ చేశారు.. ‘చూడు.. జగన్! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు అంటూ ట్వీట్ చేశారు.. రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం అంటూ కామెంట్ పెట్టారు.. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లు ఎన్ని..? నువ్వు కట్టిన ఇళ్లు ఎక్కడ? జవాబు చెప్పగలవా? అంటూ జగన్ కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోతో ట్వీట్ చేశారు చంద్రబాబు.. తన మైబైల్ ఫోన్ తో స్వయంగా నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి చాలెంజ్ విసిరిన చంద్రబాబు.. రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని క్యాడర్, లీడర్లకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement