Wednesday, December 6, 2023

జ‌గ‌న్ కు బెయిల్ ల‌భించి నేటికి ప‌దేళ్లు – శుభాకాంక్ష‌లు తెలిపిన నారా లోకేష్

అమ‌రావ‌తి – అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ పై బయటకు వచ్చి నేటికి సరిగ్గా 10 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో, జగన్ పై టీడీపీ యువ నేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. జైలు మోహన్ రెడ్డికి బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. 42 వేల కోట్ల ప్ర‌జాధ‌నం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా ప‌దేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్ర‌వాది జైలు మోహ‌న్‌ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాల‌రాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడని మండిపడ్డారు. జైలులో ఉండాల్సిన జ‌గ‌న్ ప‌దేళ్లుగా బెయిలుపై ఉంటే, జ‌నంలో ఉండాల్సిన నిజాయితీప‌రుడు సీబీఎన్ జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement