Friday, April 26, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

కర్నూల్ సిల్వర్ జూబ్లీ కళాశాల తో పాటు అనంతపురం జేఎన్టీయూ కేంద్రాల్లో గురువారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్‌ , టీచర్‌ తో పాటు స్థానిక సంస్థల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మొదలైంది. స్థానిక సంస్థలకు సంబంధించి కన్నులు సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించగా, ఉపాధ్యాయ, పట్టభద్ర అనంతపురం జేఎన్టీయూ కేంద్రంలో నిర్వహిస్తున్నారు.
కౌంటింగ్‌ ప్రారంభానికి అరగంట ముందు స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి ఎన్నికల లో పోటీ చేసిన అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో బాక్సులను
కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించారు. ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించే విధంగా పోటీ చేసిన అభ్యర్థులు, ఓటర్ల సంఖ్యనుబట్టి టేబుల్స్‌ ఏర్పాటు చేశారు.

*అనంతపురం.*కడప- అనంతపురం- కర్నూలు జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అనంతపురం నగరంలోని జెఎన్టీయు కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో ఎన్నికల పరిశీలకులు ఎం.హరి జవహర్ లాల్, ఐఏఎస్ (ఉపాధ్యాయుల నియోజక వర్గం), జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, అభ్యర్థుల సమక్షంలో గురువారం ఉదయం 8 గంటలకు ఉపాధ్యాయ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించిన ఎన్నికల అధికారులు, సిబ్బంది.కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, డిఆర్ఓ గాయత్రీ దేవి, ఎన్నికల అధికారులు, సిబ్బంది. పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement