Saturday, May 4, 2024

AP: రూ.1.52కోట్లతో నిర్మించిన రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

శ్రీ సత్యసాయి బ్యూరో, నవంబర్ 11 (ప్రభ న్యూస్) : శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గం
నల్లచెరువు మండలం, బండ్రేపల్లి నుండి చెర్లోపల్లి రిజర్వాయర్ రోడ్డు వరకు రూ.1.42.00 కోట్లతో నిర్మించిన తారు రోడ్డును, బండ్రేపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిధులు రూ.10లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్లను కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో మనం రూ. 1.52 కోట్ల రూపాయలతో 100 సంవత్సరాలు మన్నిక కలిగిన రోడ్లను నిర్మించుకున్నామన్నారు. దశాబ్దాల కాలం నుండి ఏమాత్రం అభివృద్ధికి నోచుకోనటువంటి దాదాపు 135 గ్రామాలకు అప్రోచ్ రోడ్లను నిర్మించామన్నారు.

పార్టీలకతీతంగా ప్రతి గ్రామానికి రహదారి నిర్మించి, అత్యవసర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఒకప్పుడు జబ్బు పడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే జోలెకట్టి మోసుకెళ్లే పరిస్థితి నుండి నేడు ప్రభుత్వం అందజేసే అత్యవసర సేవలైన 108 వాహనంలో ఇంటి వద్ద నుండే తరలించే స్థాయికి తీసుకొచ్చామన్నారు. అభివృద్ధి అంటే ఏంటన్నది జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు, జె సి ఎస్ ఇన్చార్జులు, వివిధ శాఖల చైర్మన్ లు, డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సోషియల్ మీడియా ఇన్ చార్జీ సోదరులు, పోలింగ్ బూత్ మేనేజర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కన్వీనర్లు, సంబంధిత అధికారులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement