Friday, October 4, 2024

AP: సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి

శ్రీ సత్యసాయి బ్యూరో డిసెంబర్ 7(ప్రభ న్యూస్) : కదిరి టౌన్ సైదాపురం జోర్ధాన్ బ్లెస్సింగ్ చర్చ్ నందు పాస్టర్స్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పీవీ సిద్దా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. జీసస్ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జీసస్ చల్లని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని రాష్ట్రంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు జీసస్ అనుగ్రహం ఉండాలని కోరుకున్నారు.


ఈ సందర్భంగా జి-సేవ సభ్యులు మాట్లాడుతూ… కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డిపై జీసస్ అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, వారికోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఈ వేడుకల నిర్వహణకు ఎమ్మెల్యే విరాళంగా రూ.50 వేలను అందజేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement