Tuesday, April 30, 2024

AP : గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభ్యం….

విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. ఇవాళ ఉదయం నుండి మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేప‌ట్ట‌గా, అప్పికొండ ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి ఆచూకీ ల‌భ్యం కావ‌డంతో బాధిత మత్స్యకార కుటుంబాలు ఊపిరిపీల్చుకున్నాయి.

- Advertisement -

సోమవారం వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ తెలియడంతో వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. విశాఖ హార్బర్‌ నుంచి వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు క్షేమంగా అప్పికొండ ప్రాంతంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కాగా, సముద్రపు అలల ధాటికి వారు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. ఈ క్రమంలో బోటు దెబ్బతినడంతో బోటుపై భాగంలోనే వారు ఆరుగురు ఉండిపోయారు.

నిన్న రాత్రంతా వారు సముద్రంలోనే ఉండిపోయారు. అనంతరం, అప్పికొండ తీరానికి చేరుకోగానే గంగపుత్రులు అధికారులకు సమాచారం అందించారు. వారంతా క్షేమంగానే ఉన్నట్టు చెప్పారు. వీరిలో కారి చిన్నారావు (45), కారి నరేంద్ర(18), మైలపల్లి మహేష్‌ (18), వాసుపల్లి అప్పన్న (35), కారి చినసత్తెయ్య (55), వాసుపల్లి పొడుగు అప్పన్న(32) ఉన్నారు. ఇక, వీరు గల్లంతైన నేపథ్యంలో కోస్టుగార్డుకు చెందిన రెండు నౌకలు, నౌకాదళానికి చెందిన హెలికాప్టర్‌ గాలింపు చర్యలు చేపట్టాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement