Friday, October 11, 2024

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని కనకవీడు గ్రామానికి చెందిన కుమ్మరి వీరేష్(42)పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నందవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు గత రెండు సంవత్సరాలుగా ఆనారోగ్యంతో బాధపడుతూ, తన పోలంలో వ్యవసాయ చేసిన నష్టాలు రావడంతో దాదాపు లక్ష రూపాయలు అప్పు చేసి తీర్చలేక ఆదివారం రాత్రి సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య కుమ్మరి సరోజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని ఎస్ఐ మహేష్ కుమార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement