Friday, May 17, 2024

మీసం మెలేస్తున్న రొయ్య‌.. ఎక్క‌డంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో రొయ్య‌లు మీసాలు మెలేస్తున్నాయి. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ హార్బర్ లో లాప్ స్టార్ రకానికి చెందిన భారీ రొయ్య ఒక‌టి మ‌త్స్య‌కారుల‌కు దొరికింది. ఈ భారీ రొయ్య ఒక్క‌టే సుమారు 800 గ్రాములు బరువు ఉంది. అంతేకాకుండా పెద్ద పెద్ద మిసాలతో ఉండడంతో చూపరులను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అరుదైన రొయ్యను స్థానిక వ్యాపారులు 600 రూపాయలకు కోనుగోలు చేశారు. ఇట్లాంటి రొయ్యలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని. త‌రుచుగా త‌మ వ‌ల‌ల‌కు చిక్కితే క‌నుక ఇక పంట పండినట్లే అంటున్నారు మత్స్యకారులు. ఈ భారీ మీసాల రొయ్య విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రొయ్యల ఉత్పత్తిలో ఏపీ దుమ్మురేపుతోంది. దేశంలోనే రికార్డు సృష్టిస్తోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశ రొయ్యల‌ ఉత్పత్తిలో ఏపీ 75.84% వాటాతో ఉన్న‌ట్టు మెరైన్ ప్రొడక్టస్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వెల్లడించింది. 2020–21లో దేశవ్యాప్తంగా 8,43,633 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయితే.. అందులో ఏపీ నుంచే దాదాపు 6.40 టన్నుల రోయ్య‌లు ఉత్పత్తి అయినట్లు వివరించింది. దీంట్లో వనామి రకం రొయ్యలు అత్యధికంగా 6,34,672 టన్నులు ఉత్పత్తి అయ్యాయని, బ్లాక్‌ టైగర్‌ రొయ్యలు వాటా 5,222 టన్నులని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement