Thursday, April 25, 2024

ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా లక్ష్మీషా బాధ్యతల స్వీకరణ

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా జి.లక్ష్మిషా బుధవారం సంస్థ ప్రధాన కార్యాలయంలో పదవీ భాద్యతలుస్వీకరించారు.ఇంతవరకూమేనేజింగ్‌ డైరెక్టర్‌ గా పనిచేసిన నారయణ భారత్‌ గుప్తా ముఖ్యమంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా బదలీ కావడంతో ఆ స్థానంలోజి.లక్షిషాను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. బుధవారం పదవీ భాద్యతలను స్వీకరించిన ఆయన రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి .రమేష్‌,గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ్‌ జైన్‌లను మర్యాద పూర్వకంగా కలిసి గృహనిర్మాణాల పురోగతిఫై చర్చించారు.

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పధకం సకాలంలో పూర్తీ చేయటానికి సంస్థ లోని ప్రతి ఒక ఉద్యోగి నిరంతరం కృషి చేయాలని మేనేజింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీషా సూచించారు.నిర్దేశించిన లక్ష్యాలుకు అనుగుణంగా గృహాల నిర్మాణాలు పూర్తీ కావాలని,ఇతర విభాగాల అధికారులను సమన్వయం చేసుకుంటూ జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేయండి: మంత్రి జోగి రమేష్‌
రాష్ట్రంలో జగనన్న కాలనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి.రమేష్‌ అధికారులకు సూచించారు.బుధవారం ముఖ్యమంత్రి గృహనిర్మాణ శాఖ ఫై జరిపిన సమీక్షకు ముందు మంత్రి గృహనిర్మాణ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు .ఇల్లనిర్మాణ పనులను సకాలంలో పూర్తీ చేయటానికి నిరంతరం కృషి చేయాలని,కింది స్థాయి అధికారులతో నిరంతరం సమీక్షలు చేస్తూ సకాలంలో పూర్తీ చెయటానికి చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement