Tuesday, April 16, 2024

ఏపీలో రియల్ హీరో సోనూసూద్‌కు పాలాభిషేకాలు

కరోనా కష్టకాలంలో నటుడు సోనూసూద్ ఎంతో మందికి సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీలోని కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు. తమ జిల్లాలకు ఆక్సిజన్ ప్లాంట్‌ను ఇస్తున్నందుకు ఆ జిల్లాల్లోని ప్రజలు సోనూసూద్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. సోనూసూద్‌ను ఆదర్శంగా తీసుకుని అందరూ తమవంతు సాయం చేయాలని కర్నూలు, నెల్లూరు జిల్లాల ప్రజలు కోరుతున్నారు. కాగా సోనూసూద్ ఈ ఆక్సిజన్ ప్లాంట్లను దేశంలోని మరికొన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement