Sunday, April 21, 2024

Karnul – సామాజిక సాధికార యాత్రకు ఉప్పెనలా తరలి వచ్చిన జన సునామీ

కర్నూలు,బ్యూరో .వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా బడుగులను తలెత్తుకునేలా ముఖ్యమంత్రి జగన్ చేశారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. శుక్రవారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు నియోజకవర్గంలోని మూడు మండలాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ వెంబడి నడిచిన జనం… బహిరంగ సభకు హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీలు సంజీవ్‌కుమార్, గోరంట్ల మాధవ్, గురుమూర్తి పాల్గొన్నారు. ఇంకా స్థానిక సంస్థలు ప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్నసామాజిక సాధికార యాత్ర చరిత్ర పుటల్లో లిఖించబడుతుంది. గతంలో మహానుభావులెందరో..ఈ దేశంలో సామాజిక సాధికారత సాధించాలని ఉద్యమాలు చేశారు. కానీ ఈ రాష్ట్రంలో…ఆ మహనీయుల ఆశయాల బాటలో నడిచి..మనకు సామాజిక సాధికారత అందించారు సీఎం జగన్ కి సాధ్యమైంది అన్నారు.గతంలో చంద్రబాబు మనల్ని బెదిరించారు. చులకనగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల ప్రజలు గుండెల మీద చెయ్యివేసుకుని ముందుకు నడుస్తున్నారన్నారు.

ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. ఆయా వర్గాల ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని జగన్ చూసుకుంటున్నారన్నారు.ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మన పిల్లల భవిష్యత్‌ గురించి ..ఎంతో ముందుచూపుతో అనేక పథకాలు అమల్లోకి తెచ్చారన్నారు. ముఖ్యంగా విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారనీ తెలిపారు. 2024 లో కూడా తిరిగిజగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడం బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చాలా అవసరమన్నారు.

కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఇంతకు ముందు మన దళిత కుటుంబాల వారు తలవంచుకుని బతికే వారన్నారు.అలాంటి వారిని అక్కున చేర్చుకుని, వారి తలరాతలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి కే సాధ్యమైంది అన్నారు.జగనన్న పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజిక సాధికారత సాధించిపెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గా పేర్కొన్నారు.. సామాజిక న్యాయానికి అసలుసిసలు అర్థం చెప్పారన్నారు. నేడు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. జగనన్న అండ ఉంది. ఆయన చేయూత,ఆయన భరోసా ఉంది. దేవుడు జగన్‌ వెంట ఉన్నాడు. ఆయన ద్వారా మనకు సాయం చేసేలా చేస్తున్నాడనీ పేర్కొన్నారు.ఇప్పుడు జగనన్న పాలనలో మన ఆత్మగౌరవం పెరిగిందనీ దీంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ జగనన్న వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నార అన్నారు.పేదల కోసం, బడుగు,బలహీన వర్గాల సంక్షేమం కోసం జగనన్న చేస్తున్న మంచి, దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయట్లేదన్నారు.

ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూనేడు మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే..చాలా సంతోషమేస్తోందన్నారు.జగన్ మీద అభిమానంతో మీరంతా వచ్చారని అర్థమవుతోందన్నారు.మన ప్రత్యర్థి చంద్రబాబు రాజకీయంగా చేసిన అరాచకాలు మనకందరికీ తెలుసు. ప్రత్యేకహోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముఖ్యమని చెప్పి, స్పెషల్‌స్టేటస్‌ను వదిలేసిన బాపతు రాజకీయనాయకుడు చంద్రబాబుగా పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని పదేళ్లపాటు అక్కడ నుంచి పాలన చేసే అవకాశం ఉన్నా, వదిలేసి వచ్చిన వాడు ఆయన మాత్రమే అన్నారు.చెప్పుకుంటూ పోతే చంద్రబాబు తన హయాంలో ఎన్నెన్ని స్కాములు చేశాడో లెక్కకు మించి ఉంటాయన్నారు. వ్యవసాయం దండగ అని పనికిమాలిన మాటలు మాట్లాడిన నాయకుడు చంద్రబాబు మాత్రమే అన్నారు. ఉచితవిద్యుత్‌ అడిగితే, విద్యుత్‌ బిల్లులపై ఉద్యమం చేస్తే, హైద్రాబాద్‌లో రైతులపై గుర్రాలతో తొక్కించి, కాల్పులు చేపించిన రాక్షసుడు బాబు అని పేర్కొన్నారు.ఇక ఎస్సీ,ఎస్టీ,బీసీలను కులం పేరిటే చులకన చేసి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు.మైనార్టీలను దేశద్రోహుల కింద లెక్కేసిన దుర్మార్గుడు. వారిపై కేసులు కూడా పెట్టారన్నారు.

- Advertisement -

ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూఅర్హతలున్న లబ్దిదారుల్లో ఏ ఒక్కరూ సంక్షేమపథకాల లబ్ది పొందకుండా ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్‌ తపిస్తున్నారు. ఇంటి గడప దగ్గరకే సంక్షేమ పథకాల లబ్ధి అందేలా చేస్తున్నారు. వివక్ష లేకుండా, లంచాలు లేకుండా, పారదర్శకంగా అమలు చేస్తున్న ఘనత జగనన్న ప్రభుత్వానిదే అన్నారు.సమాజంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా వుంటేనే, బాగా చదువుకుని ఉంటేనే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది. నాడు–నేడు పథకంతో విద్య,వైద్యరంగాల్లో జగనన్న తెచ్చిన మార్పులు అద్భుతమైనవి. అవి పేదల జీవితాల్లో ఎంత వెలుగులు నింపుతున్నాయో మన కందరకు తెలుసన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో ఆ సామాజికాభివృద్ది స్పష్టంగా కనిపించి తీరుతుందనీ పేర్కొన్నారు.

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తూ, ప్రజల వద్దకు పాలనను తెస్తానని హామీ ఇచ్చారన్నారు. మాట తప్పని జగన్‌ చెప్పినట్టే చేస్తున్నారు. ఇప్పుడు ప్రజాపాలన నడుస్తోందన్నారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను ఒక స్థాయికి తీసుకెళ్లారన్నా, రాజకీయ పదవుల్లో కూర్చోబెట్టారన్నా.. ఆ ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిగారికే దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ సోదరులను ఛైర్మన్లుగా, డైరెక్టర్లుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిదే అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీసీలుగా బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలను నిలబెట్టి గెలిపించిన ఘనత జగన్ది అన్నారు.ఇక పేదవర్గాల ఆర్థికస్థాయిని పెంచేందుకు ..వారి ఖాతాల్లో నేరుగా డీబీటీ ద్వారా రూ.2.36వేల కోట్లు ముఖ్యమంత్రి అందించిన విషయాన్ని గుర్తు చేశారు.విద్యా, వైద్యరంగాల్లో విప్లవాత్మక మార్పులతో అట్టడుగువర్గాలు, అణచివేయబడ్డ వర్గాలకు గొప్ప మేలు చేశారన్నారు. నేడు ఆయా వర్గాల పిల్లలు గర్వంగా సర్కారు బళ్లకు వెళుతున్నారన్నా, కార్పొరేట్‌ స్కూళ్ల స్థాయిలో చదువుతున్నారన్నా అది జగన్‌ ఘనతే అన్నారు. అలాగే ఎలాంటి జబ్బు వచ్చినా భయపడకుండా, కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందేలా జగన్ చేశారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలన ప్రజల పాలన. సుపరిపాలన. పారదర్శక పాలనగా ఆయన కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement