Friday, May 17, 2024

KNL: జ్యోతిబాపూలే అందరికీ ఆదర్శప్రాయుడు.. ఎంపీ సంజీవ్ కుమార్

కర్నూలు ప్రతినిధి, నవంబర్ 28: మహాత్మా జ్యోతిబాపూలే అందరికీ ఆదర్శప్రాయుడని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కర్నూలు నగరంలోని బిర్లా గేట్ వద్ద వున్న మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహానికి కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈసందర్భంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. సామాన్య జీవితంతో అసాధారణంగా కృషి చేసిన మహాత్మ జ్యోతిబా పూలే వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. సమాన హక్కుల కోసం, అట్టడుగు జాతుల విద్యాభివృద్ధి కోసం సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చారన్నారు. ఆడపిల్లలకు చదువు అవసరమని ఆనాడే పాఠశాలలను నెలకొల్పిన మహనీయులు జ్యోతిబాపూలే అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన మాట్లాడుతూ… జ్యోతిబా పూలే స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబా పూలే అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే అందరికీ ఆదర్శప్రాయమని, ప్రభుత్వ ఆధ్వర్యంలో మహానుభావులు జ్యోతిబా పూలేను స్మరించుకుంటున్నామన్నారు. బడుగు బలహీన వర్గాల వారు ఎలా నడుచుకోవాలని దిశా నిర్దేశం చేసిన మహానుభావులు పూలే అన్నారు. సమాజంలో కుల, మత విభేదాలు లేకుండా లింగ విభేదాలు లేకుండా, మనిషిని మనిషి ఏ విధంగా గౌరవించాలి అనేది విద్యతోనే సాధ్యమవుతుందనే సమాచారాన్ని మనకు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారిణి వెంకటలక్ష్మి, ఏఈఓ జాకీర్ హుస్సేన్, కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement