Friday, March 29, 2024

Big Story : మూత దిశగా పలు యూనివర్సిటీలు.. పీజీలో చేరికలు ఢమాల్‌!

అనంతపుర, ప్రభ న్యూస్‌ బ్యూరో : 01,03,06,07,09… ఇవేవో అంకెలు అనుకుంటే పొరపాటే? ఎస్కేయూలో పీజీ సీట్ల భర్తీ ఇలా ఉంది. పీజీ సీట్ల భర్తీలో ఎస్కేయూ డీలా పడింది. 2022 సంవత్సరానికిగాను పీజీ మొదటి విడత సీట్ల భర్తీ పూర్తయింది. ఎస్కేయూలో రెగ్యులర్‌ 686, పేమెంట్‌ 333, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ 167 సీట్లు ఉన్నాయి. ఇందులో రెగ్యులర్‌ 401, పేమెంట్‌ 92, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ 115 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మొత్తంగా 1186 సీట్లకు గాను 608 మాత్రమే భక్తి అయ్యాయి. అయితే ఇందులో హిస్టరీ 28 సీట్లకు గాను 09, సోషియాలజీ 28 సీట్లకు గాను 03, ఇన్సుమ్రెంటేషన్‌ 13 సీట్లకు గాను 04, హిందీ 17 సీట్లకు గాను 01, సోషల్‌ వర్క్‌ 22 సీట్లకు గాను 07, జాగ్రఫీ 17 సీట్లకు గాను 07 మాత్రమే భర్తీ అయ్యాయి.. పలు భాగాలలో సీట్ల భర్తీ ఒక అంకె దాటలేదు. మరోవైపు ఆర్ట్స్‌ విభాగాలలో సీట్ల భర్తీ అర కోరగా ఉంది. ఆర్ట్స్‌ విభాగాలు మూత దిశగా పయనించే అవకాశం ఉంది.

- Advertisement -

మూత దిశగా యూనివర్సిటీలు..

రాష్ట్రంలో యూనివర్సిటీలు మూత దిశగా పయనిస్తున్నాయి. ఉమ్మడి కామన్‌ పరీక్ష నిర్వహణతో రాష్ట్రంలో పలు యూనివర్సిటీల సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో మరో రెండు సంవత్సరాలలో యూనివర్సిటీలో మూతపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో యూనివర్సిటీలు సొంతంగా పీజీ ఎంట్లెన్స్‌ నిర్వహించి సీట్లు భర్తీ చేసుకునేవారు. ప్రస్తుతం ఉమ్మడి పరీక్ష కావడంతో సీట్ల భర్తీ గగనంగా మారింది. పటిష్టంగా ఉన్న యూనివర్సిటీల వైపు విద్యార్థులు మోగ్గు చూపుతున్నారు. మరోవైపు డిగ్రీ తోనే ఉద్యోగ అవకాశాలు ఉండడంతో.. పీజీ వైపు విద్యార్థులు ఆసక్తి కనపరచలేదు.

ఎస్కేయూ పయనం ఎటు?

ఎస్కేయూ గతంలో విద్యార్థులతో కిటకిటలాడేది. ప్రస్తుతం విద్యార్థులే కరువయ్యారు. ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాల విద్యార్థులు లేకపోతే ఎస్కేయూ మూత వేసుకోవాల్సిందే అని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ట్స్‌ విభాగాలలో విద్యార్థుల చేరిక పూర్తిగా లేదు. ఇక సైన్స్‌ విభాగాలలో అరకురగా చేరుతున్నారు. దీంతో ఎస్కేయూలో విద్యార్థులు పూర్తిగా తగ్గిపోతున్నారు. మరోవైపు రెండో పీజీ వారికి హాస్టల్‌ సౌకర్యం లేకపోవడం, ఉన్న విద్యార్థులను కూడా 75శాతం హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తామని వర్సిటీ యంత్రాంగం పేర్కొనడంతో చాలామంది విద్యార్థులు ఎస్కేయూలో చేరడానికి వెనుకంజ వేస్తున్నారు.

విద్యార్థులతో ఎప్పుడు కలకలలాడిన యూనివర్సిటీ… ప్రస్తుతం చెట్లతో కలకలాడుతోంది. భవిష్యత్తులో మూత దిశగా పయనించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పీజీ విద్యార్థులకు సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, పీజీ చేస్తే కచ్చితంగా ఉద్యోగం వస్తుంది అనే భావన లేకపోవడంతో విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. వీటికి తోడు యూనివర్సిటీ-లో పను నిబంధనలు అమలు చేయడంతో విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement