Monday, April 29, 2024

Jhum Chak Star: ధర్మవరం బ‌రిలో జుమ్ చక స్టార్..బ‌ర్రెలక్కే స్పూర్తి…

తెలంగాణ కొల్హాపూర్‌ నియోజకవర్గంలో నిరుద్యోగ యువత తరఫున ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క శిరీషను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు యూట్యూబర్లు.ఏపీలో కూడా ఒక యూట్యూబ్ స్టార్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తా అంటున్నారు.

బర్రెలక్క (శిరీష)లానే.. నిరుద్యోగ యువత తరపున తాను పోరాటం చేస్తానని ముందుకొస్తున్నారు ఈ యువతి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన దాసరి కవిత అలియాస్ జుమ్ చక జుమ్ చక స్టార్ ఏపీలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు. ముఖ్యంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఓడిస్తానని జుమ్ చక జుమ్ చక్ స్టార్ కవిత సవాల్ చేస్తున్నారు. కవిత పది హామీలతో ఏకంగా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. వాస్తవానికి దాసరి కవిత అంటే పెద్దగా ఎవరికి తెలియదు.. కానీ జుమ్ చక జుమ్ చక స్టార్ కవిత అంటే యూట్యూబ్లో వీడియోలు కో కొల్లలుగా కనిపిస్తాయి. జుమ్ చక జుమ్ చక స్టార్ కవిత యూట్యూబ్ ఛానల్‌లో కంటెంట్ లేకపోయినా కామెడీగా ఉంటుందని ఆమెకు విపరీతమైన అభిమానులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement