Sunday, February 25, 2024

Retain Symbol – జనసేనకు మళ్లీ గ్లాస్ గుర్తు వచ్చిందోచ్…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఏపీఎస్‌ఈసీ) ఉత్తర్వులు జారీచేసింది. జనసేనను రిజర్వుడు సింబల్‌ కలిగిన రిజిస్టర్డ్‌ పార్టీల జాబితాలోనే ఉంచింది. తెదేపా, వైకాపాలను గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో వాటి గుర్తులతో కొనసాగించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీని గుర్తింపుపొందిన జాతీయపార్టీగా, సీపీఐ, ఎన్‌సీపీలను గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలుగా జాబితాలో చేర్చింది.

ప్రస్తుతం గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీ జాబితాలో ఉన్న ఆర్‌ఎల్‌డీని రిజిస్టర్డ్‌ పార్టీల జాబితాలో చేర్చింది. ఈ పార్టీకి ఎలాంటి గుర్తు రిజర్వు చేయలేదు. భారాస ఇతర రాష్ట్రాల్లో గుర్తింపుపొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో ఉండేది. ఆ పార్టీ కొత్త పేరు, వివరాలతో ఏపీఎస్‌ఈసీ వద్ద దరఖాస్తు చేసుకుంటే ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో చేర్చి కారు గుర్తు కొనసాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి కేఆర్‌బీహెచ్‌ఎన్‌ చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement