Saturday, June 1, 2024

Flash: జనసేన పార్టీ కార్యాలయంపై దాడి

కర్నూల్ నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కార్యాలయంలో ఉన్న వారిని బయటకు పంపి.. ఫర్నిచర్ బయట పడేసి తాళం వేశారు. జనసేన కార్యాలయం ఖాళీ చేయాలని రెండు రోజుల క్రితం యజమానులు చెప్పారు. ఐదేళ్ల అద్దె అగ్రిమెంటు ఉందని, అద్దె చెల్లిస్తున్నప్పటికీ ఖాళీ చేయమని చెప్పడంలో అర్థం లేదని జనసేన నేతలు అన్నారు కార్యాలయం ఖాళీ చేయించేందుకు వైసిపి నేతల తెరవెనుక ఉంటూ ఇదంతా చేయిస్తున్నారని జనసేన నేత సురేష్ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement