Thursday, May 2, 2024

ముహూర్తం ఫిక్స్ – మార్చి 22నుంచి విశాఖ‌లోనే జ‌గ‌న్ మ‌కాం..

అమరావతి/విశాఖ, ఆంధ్రప్రభ: సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏదైనా అనుకు న్నారంటే దానిని సాధించేంత వరకూ విశ్ర మించరన్న నానుడి ఉంది. ఇప్పటివరకూ జరిగిన అన్ని పరిణామాల్లోనూ ఆయన తనదైన మార్కును చూపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు తాజాగా విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తానని చెప్పిన ఆయన మాటలపై నిన్నమొన్నటి వరకూ అందరిలోనూ కొంత సందిగ్ధత నెలకొంది. ఇప్పుడా సందిగ్ధతకు ఆయన ఫుల్‌స్టాప్‌ పెట్టి తన కార్యాచరణతో సమాధానం చెప్పేందు సిద్ధమౌతున్నారు. విశాఖలో వారంలో రెండు రోజులపాటు బసచేసి పరిపాలన అక్కడ నుండే కొనసాగించేందుకు కార్యోన్ముఖులవుతున్నారు. ఇందుకు సంబంధించి దాదాపుగా కార్యాచరణ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నివాసానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయని తెలుస్తోంది. విశాఖ పోర్టు ట్రస్టు గెస్ట్‌ హౌస్‌లో ఆయన బస చేయనున్నట్లు సమాచారం. అక్కడి నుండే అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

మార్చి 22న పోర్టు ట్రస్ట్‌ గెస్ట్‌ హౌస్‌లో మకాం :
మార్చి 22న విశాఖలో బసకు ఆయన ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ రోజు నుండి వారంలో రెండు రోజుల పాటు అక్కడే బస చేయనున్నారని తెలుస్తోంది. వారంలో రెండు రోజుల పాటు- విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి సమాయాత్తమౌతోన్నారు. ప్రతి సోమ, మంగళవారాల్లో ఆయన అక్కడే బస చేయనున్నారు. ఈ రెండు రోజులు కూడా అధికారిక సమావేశాలు, సమీక్షలన్నీ విశాఖ నుంచే కొనసాగించనున్నారు. అందుకు తగ్గట్లుగా సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి కూడా మౌఖిత ఉత్తర్వులు అందినట్లు సమాచారం. అయితే, దీనిని అధికారిక వర్గాలు మాత్రం కొట్టిపారేయడం లేదు. ఈరెండు రోజులు ఆయన విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌ అతిథి గృహంలో బస చేస్తారని ప్రాథమికంగా నిర్ణయించినట్లు- చెబుతున్నారు. ముఖ్యమంత్రి బస చేయడానికి అనువుగా విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌ గెస్ట్‌ హౌస్‌ లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు- తెలుస్తోంది.

బుధ, గురు వారాల్లో పల్లె నిద్ర :
సోమ, మంగళవారాల్లో విశాఖలో బస చేసిన అనంతరం బుధవారం సీఎం జగన్‌ పల్లె నిద్రకు బయలుదేరి వెళ్తారని సమాచారం. ఇప్పటికే వారంలో రెండు రోజులపాటు తాను పల్లెల్లో పర్యటిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న అభిప్రాయాన్ని స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయ వారసుడిగా ఆది నుండి రచ్చబండ కార్యక్రం నిర్వహించాలని తలంచినా కరోన వంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో అది వీలు కాలేదు. ఇప్పుడు మరో ఏడాదిలో ఎన్నికలు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండటం, రాష్ట్రంలో వేగంగా రాజకీయ పరిణామాలు మారతుండటంతో సీఎం జగన్‌ తన ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఆయన ప్రతి వారంలో రెండు రోజులు ప్రజల మధ్యకు వస్తానని నేతలకు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆమేరకు ఆయన పల్లెల్లో పర్యటించేందుకు పల్లె నిద్రను ప్రారంభించనున్నారు. పల్లెనిద్రను ముగించుకున్న తరువాత మళ్లీ తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయానికి బయలుదేరి వెళ్తారు.

ఖాళీ భవనాల్లో..
విశాఖపట్నంలో అందుబాటు-లో ఉన్న ప్రభుత్వ ఖాళీ భవనాలను పరిపాలనకు అనువుగా తీర్చిదిద్దాలంటూ ఇప్పటికే గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు- చెబుతున్నారు. దీనితో పాటు– భీమిలి రోడ్డులో ఖాళీగా ఉన్న వాటిని ప్రభుత్వ భవనాలను కూడా దీనికోసం వినియోగించే అవకాశాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న విశాఖపట్నం అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ- బిల్డింగులను కూడా గుర్తించినట్లు- సమాచారం. ఇప్పటికే వైఎస్‌ఆర్సీపీ తన కేంద్ర కార్యాలయం భవన నిర్మాణ పనులను చేపట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌ 14వ తేదీన ఎండాడ పనోరమా హిల్స్లో వైవీ సుబ్బారెడ్డి ఈ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడా పనులు ఊపందుకున్నాయి. శాశ్వత క్యాంప్‌ కార్యాలయం కూడా అందులోనే ఏర్పాటు- కానున్నట్లు- సమాచారం. ఏప్రిల్‌ లోగా పూర్తిస్థాయిలో విశాఖకు తరలి వెళ్లాల్సి ఉంటు-ందని వైఎస్‌ఆర్సీపీ భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement