Sunday, April 28, 2024

AP | 18 నుంచి ఇంటర్‌ రీ కౌంటింగ్‌..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను వెల్లడించిన అధికారులు ఫలితాలపై సందేహాలు, అనుమానాలు ఉన్న విద్యార్ధులకు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ లోగా రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు అప్లై చేసుకునే విద్యార్ధులు పీజులను చెల్లించాలని తెలిపారు.

సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు కూడా ఈ నెల 18 నుంచి 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకుని పరీక్ష ఫీజును చెల్లించాలన్నారు. రీ కైంటింగ్‌కు రూ 1300, రీ వెరిషికేషన్‌కు రూ 260 చెల్లించాలన్నారు. సప్లిమెంటరీ ఫస్టియర్‌, సెకండియర్‌ జనరల్‌, ఒకేషనల్‌ థియరి విద్యార్ధులకు రూ 550, ప్రాక్టికల్స్‌కు 250, బ్రిడ్జి కోర్సు, బైపీసీ, మేథమెటిక్స్‌ విద్యార్ధులకు రూ 150 చప్పున చెల్లించాలని పేర్కొన్నారు.

ఫస్టియర్‌ అన్ని సబెజ్జక్టులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు ఇంప్రూమెంట్‌ కోసం పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వీరికి పరీక్ష ఫీజు రూ 550తో పాటు ఒక్కో పేపరుకు రూ 160 అదనంగా చెల్లించాలన్నారు. ఫస్టియర్‌, సెకండియర్‌లలో ఉత్తీర్ణత సాధించిన ఆర్ట్స్‌ విద్యార్ధులు రూ 1240, సైన్సు రూ 1440 చెల్లించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement