Tuesday, October 8, 2024

పుట్టపర్తిలో వైసీపీ-టీడీపీల మధ్య చెప్పులు, రాళ్లదాడి.. పల్లె వాహనం ధ్వంసం

అనంతపురం, ఏప్రిల్ 1 : పుట్టపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్యకర్తలు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై రాళ్లదాడి చెప్పులు విసిరారు. శనివారం పుట్టపర్తి అభివృద్ధి విషయంపై సత్తెమ్మ దేవాలయం వద్ద చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాటకు కట్టుబడి పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు నిర్బంధించడంతో చాలాసేపు వారితో వాగ్వాదానికి దిగారు. తీరా సత్తెమ్మ దేవాలయం వద్దకు బయలుదేరిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ని పోలీసులు అనుమతించారు. అయితే ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఇంటి ముందు నుంచి ర్యాలీగా వెళుతున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు రాళ్లతో విసరడమే కాకుండా చెప్పులతో దాడి చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement