Saturday, May 18, 2024

కుప్పంలో హైటెన్షన్ – ఎమ్మెల్సీ ఇంటి ముట్టడికి టిడిపి శ్రేణుల యత్నం

కుప్పం, సెప్టెంబర్ 09(ప్రభ న్యూస్ ): తెదేపా అధినేత చంద్రబాబు ను అరెస్టు చెయ్యడం తో ఆయన సొంత నియోజకవర్గం లో శాంతి భద్రతలు అదుపులో ఉంచడం పోలీసులకు కష్టతరంగా మారింది. చంద్రబాబు అరెస్టు కావడం పట్ల వైకాపా నాయకుడు బాణాసంచా కాల్చడం పై తెదేపా శ్రేణులు ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకొని ఎమ్మెల్సీ భరత్ ఇంటిని ముట్టడి చేసేందుకు వందలాది మంది తెదేపా కార్యకర్తలు, నాయకులు కుప్పం పట్టణం పాలస్ రోడ్డు ఉన్న ఆయన ఇంటి వద్ద కు పరుగులు తీశారు. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకొని డి ఎస్ పి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులను కట్టడి చేశారు. ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద పోలీసులు మొహరించి గట్టి భద్రత చర్యలు తీసుకొన్నారు. ఒక దశలో తెదేపా శ్రేణులు పలు మార్గాలల్లో ఎమ్మెల్సీ ఇంటి వద్ద కు చేరుకోవడం తో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement