Friday, April 26, 2024

వివేకా హత్య కేసు.. పిటిషన్ల విచారణ నుంచి తప్పుకున్న హైకోర్టు జడ్జి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణ నుంచి జడ్జి తప్పుకున్నారు. ఈ కేసులో బెయిల్ కోసం సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్లపై విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ వైదొలిగారు. ఈ పిటిష‌న్‌లు తగిన బెంచ్‌ ముందుకు విచారణకు వచ్చేలా నిర్ణయం తీసుకునేందుకు ఫైల్‌ను హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర దగ్గర ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

సోమవారం ఈ పిటిషన్లపై జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ ముందు విచారణకు వచ్చాయి. సీబీఐ తరఫున లాయర్ వాదనలు వినిపించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి బెయిలు పిటిషన్‌ను వేరే బెంచ్‌ ముందు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని తాజాగా దాఖలైన రెండు బెయిల్ పిటిషన్ల విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ పిటిషన్లను మరో జడ్జి ముందుకు విచారణ కోసం వెళ్లనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement