Thursday, May 2, 2024

పేరుకు వీఐపీ రోడ్డు కానీ అంత గుంటలమయం…..

గుంటూరు ఈస్ట్ క్రైమ్ ఫిబ్రవరి 23 (ప్రభ న్యూస్) పేరుకి విఐపి రోడ్డు కానీ ఈ రోడ్లో ప్రయాణం చేయాలంటే అంతా గుంటలమయమే ఇది ఎక్కడో కాదండి మన గుంటూరు నగరంలోని కొండా వెంకటప్పయ్య కాలనీ రహదారి పేరు విఐపి రోడ్డు అని నామకరణం చేశారు, అప్పటి అధికారులు సుమారు ఈ రహదారి వేసి ఐదు సంవత్సరాలు కూడా కాక ముందే రహదారి మొత్తం అద్వానంగా తయారైంది, ఈ రహదారిలో రోజు వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు, ఈ రహదారి చుట్టుగుంట వద్ద నుండి బైపసు వరకు గుంటల మయంగా తయారైంది, ద్విచక్ర వాహనదారులు ప్రయాణాలు చేయాలంటే ప్రమాదాలకు గురవుతున్నారు, ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నా కూడా ఆలకించే నాధుడే లేడు, ఈ రహదారి కి కనీసం గుంటలు కూడా పుడ్చకుండా ఉండటం గమనర్హం రెండు రోజుల కిందట ఈ రహదారిలో ఒక ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి, ఎలక్షన్ వస్తుందంటే రాజకీయ నాయకులు మాత్రం మాకు ఓటేయండి అంటూ ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని గొప్పలు చెప్పుకుంటారు, గెలిచిన తర్వాత మీరెవరో మేము ఎవరో అన్నట్టుగా ఉంది వ్యవహారం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఈ రహదారిపై ఏర్పడిన గుంటలను పుడ్చాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement