Wednesday, April 24, 2024

గుంటూరులో గుప్పుమంటున్న గంజాయి..

గుంటూరు,ప్రభన్యూస్‌బ్యూరో: ఉమ్మడి గుంటూరు జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో గంజాయి విక్రయాలు చాపకింద నీరులా సాగిపోతున్నాయి. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న తాడేపల్లి గంజాయి బ్యాచ్‌కు అడ్డాగా మారుతోంది. గంజాయి సేవిస్తున్న యువత, విద్యార్ధులు హింసాత్మక సంఘటనలకు దిగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వీరి వింత చేష్టలు స్థానికులు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. సీఎం నివాసానికి కూతవేటు దూరంలో సన్నీ అనే గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోవడంతో లంబాడీపేట మహిళలు తా డేపల్లి పోలీసులను ఆశ్రయించారు. గంజాయి మత్తులో ప్రాణాలు తీయడానికి కూ డా వెనుకాడని పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వారి ఇళ్ళపై గంజాయి గ్యాంగులు దాడులకు తెగబడుతున్నాయి. ఇప్పటి వరకు ఉత్త రాంధ్ర ఏజన్సీ ప్రాంతాల నుంచి గంజాయి దిగుమతి అవుతుండగా అది పెద్దగా రిస్క్‌గా ఎంచి ఏకంగా కొందరు గంజాయి మొక్కలను పెరట్లో పెంచుకుంటూ పోలీసులకు చిక్కడం గుంటూరు జిల్లా తెనాలి నందులపేటలో వెలుగుజూసింది. అంతకు ముందు సత్తెనపల్లి ప్రాంతంలో ఓ రైతు మిరప, పత్తి పంట మధ్యలో గంజా యి సాగు చేస్తూ పోలీసులకు చిక్కారు. ప్రధానంగా వైకాపా నేతల అండదండలతో ఆ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు వాటి విక్రయాలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే. గత నెలలో బాపట్ల జిల్లా చినగంజాం మండలం మోటు-పల్లికి చెందిన వైకాపా ఎంపీటీ-సీ సభ్యుడు ఏకంగా మప్టీnలో ఉన్న పోలీసులకే వాటి విక్రయాలు చేస్తూ పట్టు-బడటం గమనార్హం. ఆయనే కాదు కర్లపాలెం మండలానికి చెందిన వైకాపా గ్రామ నాయకుడు గంజాయి వ్యవహారాల్లో ఉన్నారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గంజాయికి ఆకర్షితులవుతున్న విద్యార్ధులు
సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్ధులు గంజాయి దమ్ముకు ఎక్కువ అల వాటు పడుతున్నారు. గంజాయి విక్రయించె యువత విద్యార్ధులుగా మెలుగుతూ విద్యార్ధులకు వల విసురుతున్నారు. సిగిరెట్లు, తాజాగా లిక్కిడ్‌ గంజాయి అలవాటు చేస్తూ చాటుమాటు వ్యాపారం చేస్తున్నారు. గుంటూరుతో పాటు- పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రాంతాల్లో ఎక్కువగా ఇంజినీరింగ్‌, ఇతర వృత్తి విద్య కళాశాలలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల నుంచి చదువుల నిమిత్తం గుంటూరు, తాడేపల్లి, నరసరావుపేట పట్టణాలకు వచ్చిన వారు గంజాయికి ఆకర్షితులై ఈ ఊబిలో చిక్కుకుంటు-న్నారు. ఉమ్మడి గుంటూరు నుంచి ఏటా 10వేల మంది సాంకేతిక కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వెళ్తుండగా, మరో 10 వేల మందికి పైగా ఆయా వృత్తి విద్యా కోర్సుల్లో చేరడానికి బయట ప్రాంతాల నుంచి వస్తున్నారు. కొంతమంది విద్యార్థులు గంజాయి తదితర మత్తు పదార్థాలకు బానిసలుగా మారు తున్నారు. తాడేపల్లి మండలంలోని ఓ విద్యా సంస్థ పరిసరాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టగా, పలు వసతి గృహాల్లో గంజాయి పొట్లాలు వారి గదుల్లో బయటపడ్డాయి. దీన్ని బట్టి వాటి వినియోగం కళాశాల విద్యార్థుల్లో ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఈ విక్రయాలపై పోలీసుల నిఘా ఉందని చెబుతున్నా వాటి విక్రయాలు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయి. గడిచిన మూడు, నాలుగు నెలల నుంచి జిల్లాలో లిక్విడ్‌ గంజాయి పట్టు-కున్న కేసులే స్వల్పంగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం గుం టూరు లాలాపేట, పాతగుంటూరు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గంజాయిని లిక్విడ్గా చేసి విక్రయిస్తూ కొందరు విద్యార్థులు పోలీసులకు పట్టు-బడ్డారు. వారు ఇక్కడి నుంచి దిల్లీ, ఖరగ్పూర్‌ వర్సిటీ-లకు చేరుస్తున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అంత కు మునుపు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే పుత్రరత్నం ఒకరు నగరంలోని సీతారామ హౌసింగ్‌ కాలనీలో తన
స్నేహితుడి ఫ్లాట్లో ద్రవ గంజాయి నింపుతున్నట్లు- గుర్తించారు. దీన్నిబట్టి ఈ వ్యాపారం వెనుక అధికార పార్టీ కీలక నేతలు ఉన్నారనేది స్పష్టమవుతొంది.

గుంటూరు నగరంలో గంజాయి ముఠా ఆగడాలు
గుంటూరు నగరంలో బహిరంగంగానే గంజాయి సేవించి ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారు. నగరంలోని సాంబశివపేటలో ప్రైవేటు- ఆస్పత్రులు, సినిమా థియేటర్‌ ఉన్నాయి. దీంతో ఇక్కడ గంజాయి ముఠాల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా ఉంటోంది. ఆ రహదారిలో ఒంటరిగా ఎవరైనా వస్తుంటే వారిని లక్ష్యంగా చేసుకుని వీరంగం చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జనావాసాల మధ్య ఉండే అరుగుల మీద కూర్చొని ఆ ప్రాంతంలో గంజాయి, వైట్నర్‌ వంటివి తీసుకోవడం ఇక్కడ నిత్యకృత్యమే. ఆ మత్తులో చివరకు దారి దోపిడీలకు పాల్ప డుతున్నారు. ఇటీ-వల సాంబశివపేట మొదటి లైనులో ఆస్పత్రికి వెళ్లి వస్తున్న వారిని అడ్డగించి విలువైన సొత్తును లాక్కుపోయారు. అది జరిగిన రెండు రోజులకే ఓ జంట సినిమాకు వెళ్లి అనంతరం ఇంటికి వెళుతుండగా అదే ముఠా వారిని దుర్భాషలాడి గాయపరిచి వారి వద్ద డబ్బులు లాక్కుని పరారయ్యారు. దీనిపై స్థానికులు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు ఆ సమయంలో అరుగుల మీద కూర్చుని గంజాయి తీసుకుంటు-న్న వారిని స్టేషన్‌కు తరలించారు. గత ఏడాది ఒక్క గుంటూరు జిల్లాలో గంజాయికి సంబంధించి 67 కేసుల్లో 250 కేజీ ల గంజా యిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి-కై-నా సెబ్‌ పోలీసులు గంజాయి విక్ర యాలు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement