Tuesday, June 18, 2024

ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం : సోము వీర్రాజు

బాపట్ల: ఏపీ అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమ‌వుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గురువారం అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం జగన్ అన్న పేరు పెట్టుకుని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. పేదలు నిర్మించుకునే గృహాలకు మొత్తం నగదు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే జగన్ పేరు చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. పేదలకు ఇచ్చిన నివేశన స్థలాలు కొనుగోలులో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని, గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో స్థలాల కొనుగోలు విషయంలో తెనాలి ఎమ్మెల్యే అవకతవకలకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement