Friday, April 26, 2024

Good News – పోల‌వ‌రంపై కొత్త ఆశ‌లు … మొదటి ద‌శ అంచ‌నాల‌కు ఆమోదం..

అమరావతి, ఆంద్రప్రభ: పోలవరంపై కేంద్రం వైఖరితో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీ-వల అందించిన ప్రాజెక్టు తొలిదశ అంచనా వ్యయం రూ.16,952.07 కోట్లకు ఆమోదం తెలిపేందుకు కేంద్ర జలశక్తి సానుకూల దృక్పథంతో ఉన్నట్టు- సమాచారం. ఈ మేరకు కేంద్ర జలశక్తి కార్యదర్శి కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ- గురువారం ఢిల్లీలో తొలిదశ అంచనా వ్యయం ఆమోదం కోసం ప్రత్యేకంగా సమావేశమైంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ-(పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్‌, సభ్య కార్యదర్శి రఘురాం, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ కుశ్వీందర్‌సింగ్‌ వోరాతో ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొని పోలవరం ప్రాజెక్టు పురోగతి, ఏపీ ప్రభుత్వం సమర్పించిన తొలిదశ అంచనా వ్యయంపై చర్చించారు. తొలుత ప్రాజెక్టు పురోగతిపై పీపీఏ నిపుణులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించినట్టు- సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేని కొన్ని సాధారణ సాంకేతిక సవరణలను మినహాయిస్తే తొలిదశ అంచనా వ్యయం రూ 16,952.07 కోట్లకు కేంద్ర జలశక్తి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు- సమాచారం.

ఈ మేరకు జలశక్తి అంగీకరించిన వ్యయ ప్రతిపాదన కేంద్ర మంత్రి మండలికి చేరనుంది. ప్రధాన మంత్రి అధ్యక్షతన త్వరలో భేటీ- కానున్న మంత్రి మండలి సమావేశంలో తొలి దశ అంచనా వ్యయానికి నుంచి నిధులు విడుదలవుతాయని అధికారవర్గాల సమాచారం. 2013-14 అంచనా వ్యయం ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లు-..ఆ తరువాత భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస అంచనా వ్యయమే రూ.33,168.23 కోట్లు- ఉంటు-ందని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. నిర్మాణ వ్యయంతో కలుపుకుని 2017-18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,656.87 కోట్లు-గా నిర్దారించారు. గడిచిన అయిదేళ్ళుగా సవరించిన అంచనా వ్యయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తర్జన భర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక దశలో రూ.55,656.87 కోట్లకు గాను రూ 48 వేల కోట్ల అంచనా వ్యయానికి కేంద్రం నుంచి ఆమోదముద్ర పడినట్టేనని కేంద్ర జలశక్తి సంకేతాలు అందించినా ఆచరణలో అమలు కాలేదు.

ఈ నేపథ్యంలో పోలవరం తొలిదశ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా తొలి దశ అంచనా వ్యయాన్ని రూ.16,952.07 కోట్లు- నిర్ధారించి ఆమోదం కోసం కేంద్ర జలశక్తికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందించింది. పోలవరం తొలిదశ నివేదికలో డయాఫ్రం వాల్‌ మరమ్మతులు, నదీ గర్భంలో ఇసుక కోతకు గురయిన ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో అగాధాలను పూడ్చటం, 41.15 మీటర్ల కాంటూరు పరిధిలో కొత్తగా మరో 36 గ్రామాలకు పునరావాసం కల్పించేందుకు అవసరమైన అంచనా వ్యయాన్ని పొందుపర్చారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు చేసిన రూ 4,730.71 కోట్ల వ్యయాన్ని కూడా కలుపుకుంటే ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ.20,949.49 కోట్లను రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేసినట్టు- ప్రభుత్వం చెబుతోంది. పోలవరం కోసం ఇప్పటివరకు విడుదల చేసిన నిధులతో కలపకుండా సవరించిన తొలి దశ అంచనా వ్యయాన్ని ఆమోదిస్తే ప్రాజెక్టు నిర్మాణం వేగం పుంజుకుంటు-ందని అంచనా. ఈ మేరకు సవరించిన అంచనా వ్యయ నివేదిక అమోదం ఆలస్యమైతే రూ 10 వేల కోట్ల అడహక్‌ నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రధాన మంత్రి మోడీతో భేటీ- సందర్భంగా గతంలో వినతిపత్రం అందించారు.ఈ నేపథ్యంలో అడహక్‌ నిధుల కంటే సాంకేతికంగా తొలిదశ అంచనా వ్యయాన్ని ఆమోదించటంపైనే కేంద్ర జలశక్తి మొగ్గు చూపుతున్నట్టు- సమాచారం.ఆమోద ముద్ర పడితే ఆ తరువాత కేంద్ర ఆర్ధికశాఖ ్ట 6| ఓ్లబ…

Advertisement

తాజా వార్తలు

Advertisement