Friday, February 16, 2024

Prakasam బ్యారేజీ వద్ద కృష్ణమ్మ నీటి పరవళ్లు..…. నాలుగు గేట్లు ఎత్తివేత …

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) – కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటికి తోడు జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు, పొంగిపొర్లుతున్నాయి. దీంతో కృష్ణ నది పై విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజీ కి వరద తాకిడి భారీగా పెరిగింది.

బ్యారేజీ నిల్వ సామర్థ్యం 3.09 టీఎంసీలు మించి వరద నీరు ఉండడంతో అధికారులు గేట్లను ఎత్తి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం 10 గంటల సమయంలో బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి నిల్వను ఉంచుతూ దిగువకు సుమారు 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నాలుగు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువకు 6667 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 2908 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ ఫ్లో 7 వేల క్యూసెక్కులు గా ఉంది. ఇటీవల జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో కుడి అలమ కాలుములకు సాగునీటి విడుదలను అధికారులు నిల నిలుపుదల చేశారు. బిరబిరా పారుతున్న కృష్ణమ్మ సాగరే ఒడిలో కలిసేందుకు పరుగులు తీస్తోంది. మ్యారేజి నుండి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో నదీ తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement