Sunday, April 28, 2024

Surrogacy:తొలిసారిగా స‌రోగ‌సీ ద్వారా ఆవుకు కోడె దూడ జ‌న‌నం….

పుంగ‌నూరు – దేశంలోని తొలిసారిగా సరోగసీ ద్వారా ఓ నాటు ఆవుకు పుంగనూరు జాతికి చెందిన కోడె దూడ జన్మించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని శెట్టిగుంటలో ఈ ఘటన వెలుగుచూసింది.

శెట్టిగుంట గ్రామానికి చెందిన హరి అనే రైతు ఆవుకు సరోగసి పద్ధతిలో కోడెదూడ జన్మించింది. చింతలదీవి పశుక్షేత్రం నుంచి పుంగనూరు జాతి పిండాన్ని రైతు హరికి చెందిన నాటు ఆవు గర్భంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే, ఆ నాటు ఆవు గ‌త‌ రాత్రి స పుంగనూరు జాతికి చెందిన కోడెదూడకు జన్మినిచ్చింది. ఈ విషయన్నా స్వయంగా పశువైద్యులు డాక్టర్ ప్రతాప్ తెలిపారు. ఈ స‌రోగ‌సీ కోసం చింతలదీవి పశు క్షేత్రంలో అభివృద్ధి చేసిన ఏడు రోజుల వయస్సున్న ఘనీకృత పుంగనూరు జాతి పిండాన్నితెచ్చారు. ఆ పిండాన్ని శెట్టిగుంట గ్రామానికి చెందిన పమిడిగంటం హరిరావుకు చెందిన నాటు ఆవు గర్భంలో ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియ మార్చి 4, 2023న స్థానిక పశువైద్యుడు డాక్టర్‌ ప్రతాప్ స్వయంగా ప్రవేశపెట్టారు. మే 25న ఈ నాటు ఆవు చూలు కట్టింది. చూలుకాలంలో పశువు ఆరోగ్య పరిరక్షణ కోసం రూ.2,500 విలువైన దాణా, ఖనిజ లవణాలతో కూడిన మేతను ఆర్బీకే ద్వారా ఉచితంగా అందజేస్తారు. అయితే, ఈ సమయంలో నాటు ఆవు డిసెంబర్ 17వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో మేలుజాతి పుంగనూరు జాతి కోడెదూడెకు జన్మనిచ్చింది. కోడెదూడ చాలా ఆరోగ్యంగా ఉందని పశువైద్యులు ప్రతాప్ తెలిపారు. దేశంలోనే తొలిసారి ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌ అండ్‌ ఎంబ్రియో ట్రాన్సఫర్‌ విధానంలో పుంగనూరు కోడెదూడ జన్మించింది. ఈ ప్రక్రియ రూ. 5వేల నుంచి పదివేల రూపాయల వరకూ ఖర్చవతుందని ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement