Wednesday, May 22, 2024

AP : నంద్యాల జిల్లాలో అగ్నిప్ర‌మాదం

ఆత్మకూరు, ప్ర‌భన్యూస్ః ఆత్మకూరు ప్రధాన కూడలి లోని రఘునాథ్ సెంటర్ సమీపంలో ఓ పాత ప్లాస్టిక్ సామాన్ నిల్వ‌చేసే గోడౌన్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

- Advertisement -

గోడౌన్ లో మొత్తం ప్లాస్టిక్ సామాగ్రి నిల్వచేసి ఉండడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి నుండి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ గోడౌన్ మొత్తం ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతో మంటలను అదుపు చేయలేకపోతున్నారు. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల చోటు చేసుకుందా.. మరే ఇతర కారణాల వల్ల జరిగిందా అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement