Monday, April 29, 2024

AP – నకిలీ ఐటీ ఆఫీసర్ల హల్ చల్ ..భారీగా న‌గ‌దు, బంగారం దోపిడి…

తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ ఐటీ అధికారులు రెచ్చిపోయారు. ఓ బంగారం వ్యాపారిని నిలువు దోపిడీ చేశారు. రూ. 5 లక్షల నగదు, మూడున్న కిలోల బంగారం గుంజుకుని నకిలీ ఇన్ కమ్ టాక్స్ అధికారులు ఉడాయించారు. దీంతో బాధిత బంగారం వ్యాపారి నల్లజర్ల పోలీసులను ఆశ్రయించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన బంగారం వ్యాపారి తన సహచరుడితో జంగారెడ్డిగూడెం నుంచి కారు లో వస్తుండగా.. మరో కారు లో వచ్చిన నలుగురు దుండగులు అడ్డగించి ఇన్ కమ్ టాక్స్ అధికారులమని చెప్పారు. కారులోని వ్యక్తులను సోదా చేశారు

. బంగారం, నగదు కనిపించాయి. వీటికి రశీదులు అడిగారు. రశీదులు లేకపోవటంతో తమ కారులో ఈ ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకొని రాజమండ్రి వైపు తీసుకువెళ్లారు. ఆ తరువాత ఐదు లక్షల నగదు, మూడున్నర కిలోల బంగారం లాక్కొని బాధితులను మార్గ మధ్యలో వదిలేసి దుండగులు వెళ్లిపోయారు. అకస్మాత్తుగా తమను విడిచి వెళ్లటంతో ఆ దుండగులు అసలు ఐటీ అధికారులు కాదని, నకిలీలని అనుమానించిన బాధితులు నల్లజర్ల పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు ప గో జిల్లా భీమవరానికి చెందిన బంగారపు వ్యాపారి బాలుగా గుర్తించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement