Friday, May 3, 2024

Caste enumeration: ఎపిలో కుల గణన గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ లో కుల గణన ప్రక్రియను ఫిబ్రవరి 4వ తేదీ వరకు పెంచినట్లు అధికారులు వెల్ల‌డించారు.. కుల గణన సేకరణను ఈ నెల 19 నుంచి ప్రారంభించి 29వ తేదీ లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఈ మేర‌కు కుల గ‌ణ‌న కొన‌సాగుత‌న్న‌ది.

అయితే యాప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అందరి వివరాలు నమోదు చేయలేకపోయారు. దీంతో ఈ కార్య‌క్ర‌మాన్ని ఫిబ్రవరి 4 వరకు పొడిగించారు. ఆఖరి గడువు ఫిబ్రవరి 4 తర్వాత కూడా నమోదు చేయక పోతే ఫిబ్రవరి 7వ తేదీ లోపల నేరుగా గ్రామ/వార్డ్ సచివాలయాలకు వెళ్లి నమోదు చేసుకోవచ్చ‌ని అధికారుల సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement