Friday, May 10, 2024

ధ్యానం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం…

మండపేట: తుఫాన్ వల్ల రైతాంగం తీవ్రంగా నష్ట పోతున్న తరుణంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతుంది. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ సి హరి కిరణ్ మండపేట రానున్నారు. మండపేట మండలం లోని ఏడిద రైతు భరోసా కేంద్రం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జెడి నందిగం  విజయ్ కుమార్, జిల్లా పౌర సరఫరా అధికారి లక్ష్మణారెడ్డి లు ఏడిద లో పర్యటించారు. రైతు భరోసా కేంద్రం లో కొనుగోలు కేంద్రం ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలమురు వ్యవసాయ శాఖ ఏ డి సి హెచ్ కె వి చౌదరి, మండపేట మండల వ్యవసాయ శాఖ అధికారి బలుసు రవి ,ఏడిద సర్పంచ్ బురిగ ఆశీర్వాదంలు అధికారులతో చర్చించారు. జెడి విజయకుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1018 ఆర్ బికే ల్లో సోమవారం నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

తుఫాన్ వల్ల జిల్లా అత్యధిక వర్షాలు కురవడంతో దాదాపు 75 వేల ఎకరాల్లో చేలు పడిపోయినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. 16 వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం కు నివేదిక అందజేసినట్లు తెలిపారు. గతంలో ఇన్ ఫుట్ సబ్సిడీ రావడానికి 33 శాతం కన్న ఎక్కువ నష్టం లేకపోవడంతో అప్పుడు సబ్సిడీ రైతులకు రాలేదన్నారు. ఇప్పుడు నష్టం 33 శాతం కంటే అధికంగా ఉందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గొనే సంచులు సరఫరా, రైస్ మిల్లులుతో అనుసంధానం తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. కాగా అక్కడికి చెరుకున్న రైతులు పంట నష్టం తీవ్రంగా ఉందని  ఈ వర్షం వల్ల రైతుల పుట్టి మునిగిందని వాపోయారు. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు సడలించాలని, తేమ శాతం, రంగు మారిన వంటి నిబంధనలు రైతులకు ఉరి కొయ్యలు గా తయారయ్యాయని పేర్కొన్నారు. దీనిపై జెడి స్పందిస్తూ ఈ నిబంధనలపై రాష్ట్ర స్థాయి లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అక్కడి ఉత్తర్వులు అనుసరించి ధాన్యం సేకరణ చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలోవిలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ రమ్య, షణ్ముక్, సొసైటీ ప్రెసిడెంట్ రామిశెట్టి శ్రీ హరి, ఎం ఎస్ ఓ పద్మ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement