Sunday, April 28, 2024

AP : అభివృద్ధి వికేంద్రీకరణ ప్రభుత్వ లక్ష్యం… సీఎం జగన్​

శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా రాజధాని కోల్పోయిన కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. కర్నూల్ నగర సమీపంలోని లక్ష్మీపురం వద్ద గల జగన్నాధ గట్టులో ఆయన నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. అంతకుముందు న్యాయ యూనివర్సిటీకి చెందిన పైలాన్ ఆవిష్కరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. హైదరాబాద్ కు రాజధానిని తరలించే సమయంలోనూ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని తీర్మానించారని, కానీ అది సాధ్యం కాలేదన్నారు. తాము అధికారంలో వచ్చిన మొదట్లోనే తాము హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నారు. 1937లో కుదిరిన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకే ఇక్కడ లా యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామని తెలిపారు.

జాతీయ లా యూనివర్సిటీ కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. న్యాయపరమైన అంశాలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జాతీయ న్యాయ యూనివర్సిటీతో పాటు ఇప్పటికే కర్నూలుకు ఏపీ లీగల్ మెట్రాలజికల్ కమిషన్, లేబర్ కమిషన్, వ్యాట్ అప్పిలేట్ కమిషన్, వక్ఫ్ బోర్డు, మానవ హక్కుల కమిషన్‌, లోక యుక్తలను లను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు త్వరలో సిబిఐ కోర్టు కూడా కర్నూలుకు రానుందన్నారు. వ్యాయా విభాగం సంబంధించిన సంస్థలన్నీ ఇకపై కర్నూలు కేంద్రం నుండే విధులు నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలు ద్వారా రాయలసీమకు మంచి భవిష్యత్తు కల్పించడమే తమ ఉద్దేశంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వీటివల్ల ఇక్కడ ప్రజలకు సహేతుక న్యాయం జరుగుతుందన్నారు.

వీటి కోసం ఇక్కడ ప్రజలు ఎదురుచూస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నేషనల్ లా యూనివర్సిటీ ఇక్కడికి రావడం, త్వరలో మంచి హైకోర్టు భవనం కూడా ఇక్కడికి వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. లా యూనివర్సిటీ ని 150 ఎకరాల సువి శాలమైన స్థలంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటివల్ల కర్నూలు ప్రాంతానికి మరింత మంచి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్, కర్నూల్ మేయర్ బి వై రామయ్య, జిల్లా కలెక్టర్ సృజన. వైసీపీ కార్పొరేటర్లు, ఉమ్మడి జిల్లాకు చెందిన న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు. ఇరు జిల్లాలకు చెందిన నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement