Thursday, May 2, 2024

Cyclone Alert – ఎపికి “మైచౌంగ్‌” తుపాను గండం ….రేపు మ‌చిలీప‌ట్నం – నెల్లూరు మ‌ధ్య తీరం దాటే అవ‌కాశం..

4, 5 తేదీల్లో దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం
తీరప్రాంత జిల్లాలకు భారీ వర్షాలు
ముంచుకొస్తున్న మైచౌంగ్‌ తుపానుపై అప్రమత్తమైన కేంద్రం
రేపు మ‌చిలీప‌ట్నం – నెల్లూరు మ‌ధ్య తీరం దాటే అవ‌కాశం
జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ సమావేశం
ఏపీ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలు అప్రమత్తం
కంట్రోల్‌ రూంల ఏర్పాటు

అమరావతి, : తుపాన్‌ తరుముకొస్తోంది. ఆగ్నే య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రాగ ల 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావర ణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా గంట కు 10 కి మీ వేగంతో కదిలి పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 560 కి.మీ.చెన్నైకి తూర్పు- ఆగ్నేయంగా 580 కి.మీ, బాపట్లకు ఆగ్నేయంగా 760 కి.మీ మరియు మచిలీపట్నానికి ఆగ్నేయంగా 740 కి.మీ. వద్ద శ‌నివారం ఉద‌యానికి కేంద్రీ కృతమై ఉంది,

ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని, అది వాయువ్య దిశగా కదిలి మరింత బలపడి తుఫానుగా మారి దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ ,ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి 4వ తేదీ సాయంత్రం నెల్లూరు -మచిలీపట్నం మధ్య తీరము దాటే అవకా శం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈనెల నేటి నుంచి 5 వతేదీ వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది.

తీర ప్రాంత జిల్లాలపై ప్రభావం
తుపాన్‌కు మైఛౌంగ్‌ అని పేరు పెట్టారు. రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల అన్నింటిపై తుపాన్‌ ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కృష్ణా, గుంటూరు, బాప ట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలుజారీ చేస్తోంది. నెల్లూరు, తిరుప తి, చిత్తూరు జిల్లాల్లో గడిచిన మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 6వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం నుండి కోస్తా తీరం వెంబడి గంటకు 55 -75 కీమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని 5వ తేదీన కొన్ని జిల్లాల్లో అతి తీవ్రభారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్‌ సూచించారు. ప్రస్తుత వాతా వరణ పరిస్థితుల నేపథ్యంలో సముద్రం అలజడిగా ఉంటు-ందని మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెెళ్ళొద్దని సూచించారు. రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహ ణ సంస్థలో స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు- చేశారు. ప్రజలకు అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు కంట్రో ల్‌ రూమ్‌ నెంబర్లు 1070, 112, 18004250101 అందుబాటు-లో ఉండే లా ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితుల్ని పర్యవేక్షణ చేస్తూ జిల్లాల యంత్రాంగాన్ని విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement