Monday, May 6, 2024

Andhra Pradesh – తీరం దాటుతున్న కాంగ్రెస్ తుపాను: గిడుగు

ఇబ్రహీంపట్నం,ప్రభ న్యూస్ – కాంగ్రెస్ తుపాను తీరం దాటుతోంది. కర్ణాటకలో మొదలైంది… తెలంగాణను తాకింది.. త్వరలోనే ఆంధ్రాకు వస్తుంది’ అని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మైచాంగ్ తుపాను వల్ల ముంపునకు గురైన వరి పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత ఐదేళ్లు చంద్రబాబు, నాలుగున్నర సంవత్సరాలకు పైగా జగన్మోహన్ రెడ్డి పాలనలను చూసిన ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ తోనే మేలు జరుగుతుందనే భావనకు వచ్చారని చెప్పారు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని, ఆ ప్రభావం ఆంధ్రాలో ఉండబోతుందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆంధ్రాలో కాంగ్రెస్ బలోపేతానికి ఎక్కువ సార్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలీయమైన శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement