Sunday, April 28, 2024

వేరుశనగ రైతులకు పరిహారం చెల్లించాలి.. కలెక్టరేట్ వద్ద టీడీపీ ధర్నా

శ్రీసత్యసాయి ప్రతినిధి : శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వేరుశనగ పంట సాగుచేసి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. శుక్రవారం నాయకులు స్థానిక గణేష్ సర్కిల్లో వారు మాట్లాడుతూ.. జిల్లాలో 10లక్షల రైతు కుటుంబాలు ఉంటే నామమాత్రంగా ఇన్సూరెన్స్ లు చెల్లించి రైతులను నట్టేట ముంచారన్నారు. ఒకసారి అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ రైతుల పక్షపాతి అని చెప్పుకుంటున్నారు కానీ చేసింది శూన్యమన్నారు.

అనంతరం నన్నే సర్కిల్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షులు పార్థసారథి, మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత, మాజీ ఎంపీ నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ గుండుమూల తిప్పేస్వామి, నాయకులు అంబికా లక్ష్మీనారాయణలతో పాటు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement