Saturday, October 12, 2024

Breaking: సీఎం జగన్ కర్నూలు జిల్లా పర్యటన వాయిదా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 4న కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఆయన పర్యటించాల్సి ఉంది. ఇప్పటికే ఈ మేరకు మంత్రి బుగ్గన ఏర్పాట్లు చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల సీఎం జగన్ పర్యటన వాయిదా పడినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు మరో రోజు ఖరారు చేసి సీఎం జగన్ పర్యటన షెడ్యూల్‌ను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

కాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అన్నీ సీట్లు గెలిచే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా ఈ నెల 4న కర్నూలు జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. ఆ టూర్ వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement