Monday, March 4, 2024

AP : ఈనెల 30న నంద్యాల‌, వైఎస్సార్ జిల్లాల్లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

ఈనెల 30న నంద్యాల‌, వైఎస్సార్ జిల్లాల్లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి చేరుకుంటారు.అక్కడి నుంచి అవుకు రెండవ టన్నెల్‌ సైట్‌కు చేరుకుని నీటిని విడుదల చేసి రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు.

అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ పరిశీలన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అక్కడి నుంచి కడప చేరుకుని పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement