Monday, April 29, 2024

Supreme Court | చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. మే 7కి వాయిదా

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీఐడీ తరఫున రంజిత్ కుమార్ వాదనలు వినిపించగా, చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూత్రా వాదనలు కొనసాగించారు. బెయిల్ షరతులను చంద్రబాబు ఉల్లంఘించారని సీఐడీ పేర్కొంది.

టీడీపీ అధికారంలోకి వస్తుందని, అధికారుల జాబితా మా వద్ద ఉందని నారా లోకేష్ అధికారులను బెదిరించినట్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుకు బెయిల్ వస్తే కొడుకు మాట్లాడితే ఎలా ఉల్లంఘన అవుతుందని సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. జస్టిన్ బేలా ఎం త్రివేది, జస్టిన్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే బెయిల్ షరతులను ఉల్లంఘించవద్దని ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను మే 7కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement