Thursday, May 9, 2024

Brahmotsvas – పెద్దశేష వాహనంపై మలయప్ప స్వామి

తిరుమల – భువిపై వెలసిన కలియుగ వైకుంఠం తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున మలయప్ప స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో విహరించారు.

పెద్ద శేషు అంటే ఆదిశేషువు. నాగులలో అత్యంత శ్రేష్టుడు ఆదిశేషువు. అందుకే అన్నమయ్య ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము పదివేల శేషుల పడగలమయము’ అని కీర్తిస్తాడు. అల వైకుంఠములో ఆదిశేషునిపై శయనించే శ్రీమహావిష్ణువు బ్రహ్మోత్సవాల తొలిరోజున ఆ వాహనంపై విహరించడం విశేషం. పెద్ద శేషవాహనంపై ఉన్న మలయప్పస్వామిని వీక్షిస్తే పాపాలు తొలగిపోతాయని కోట్లాదిమంది భక్తుల ప్రగాఢ విశ్వాసం

Advertisement

తాజా వార్తలు

Advertisement