Sunday, April 21, 2024

Bhavani దీక్ష విరమణ భక్తులందరికీ ఉచిత లడ్డూ ప్రసాదం ..

ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో – భవాని దీక్షల విరమణ సందర్భంగా లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. పాలకమండలి 8వ సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు విలేకరులకు వివరించారు.

ఈ సందర్భంగా చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ భవాని దీక్ష విరమణకు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నం అన్నారు. ప్రతీ భక్తునికి 20 గ్రాముల ఉచిత లడ్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు .ప్రసాదం తయారీలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఎంతమంది వచ్చిన వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.

శబరిమలలో భక్తుల రద్దీ నీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నాం అన్నారు.అన్నీ కౌంటర్స్ లో టికెట్స్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. స్నానానికి 800 షవర్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉచిత ప్రసాదాల పంపిణీ ఉంటుందన్నారు. 15 లక్షల 60 వేల లడ్డూలు గత ఏడాది చేస్తే ఈ ఏడాది 20 లక్షల లడ్డు ప్రసాదాలు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.

నాలుగు హోమ గుండాలు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. గిరి ప్రదక్షిణల్లో 14 మెడికల్ టీమ్స్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయన్నారు

.ఈ విలేకరుల సమావేశంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, బుద్దా రాంబాబు, చింతా సింహాచలం, చింకా శ్రీనివాసులు, నంబూరి రవి, దేవిశెట్టి బాలకృష్ణ, బచ్చు మాధవీ కృష్ణ, తొత్తడి వేదకుమారి, అనుమోలు ఉదయలక్ష్మి, కొలుకులూరి రామసీత గార్లు, ప్రత్యేక ఆహ్వానితులు జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చెన్నా జనార్దన్ రావు, కోసూరి వెంకట రాజు, మార్నెడి రాఘవ రాగిణి ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కె. వి ఎస్ కోటేశ్వర రావు, లింగం రమాదేవి ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement