Wednesday, April 17, 2024

Balasore – మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను ఎయిర్ లిఫ్ట్ చేస్తాం …మంత్రి అమర్నాథ్

బాలాసోర్ : కోరమండల్, యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ప్రమాదంతో గాయపడిన ఎపి క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య సేవ‌ల కోసం ఎపికి ఎయిర్ లిఫ్ట్ చేస్తామ‌ని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ తెలిపారు.. ఒడిశాలోని బాలసోర్ రైలు ప్రమాద దుర్ఘటన స్థలానికి ముగ్గురు ఐఏఎస్‌, ముగ్గురు ఐపీఎస్ అధికారుల బృందంతో కలిసి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెళ్లారు. అక్క‌డ అధికారుల‌తో ఎపి ప్రయాణీకుల స‌మాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, రైలు ప్రమాదంలో 178 మంది తెలుగు వారు ఉన్నారని మంత్రి అమర్నాథ్‌ తెలిపారు. మృతులు, గాయపడ్డవారు, మిస్సింగ్ వివరాల సమాచారం అధికారులు సేకరిస్తున్నారని చెప్పారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లలో కంట్రోల్ రూమ్‌లు పనిచేస్తున్నాయన్నారు. విజయవాడలో దిగాల్సిన 39 మందిలో 23 మంది కాంటాక్ట్‌లోకి వచ్చారని వెల్లడించారు. ఐదుగురి ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయని.. మరో ఇద్దరి ఫోన్లు నాట్ రిచబుల్ అని వస్తున్నాయన్నారు. ఐదుగురు ఫోన్లు లిఫ్ట్‌ చేయడం లేదని మంత్రి వివరించారు. మొత్తం 178 మందిలో 53 మంది వివరాలు,స‌మాచారం తెలియ‌డం లేద‌ని అన్నారు.. వారికోసం వివిధ హాస్ప‌ట‌ల్స్ లో విచార‌ణ జ‌రుపుతున్నామ‌న్నారు.. స్ప‌ల్పంగా గాయ‌ప‌డిన 55 మందిని ప్ర‌త్యేక రైలులో నేడు విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్నామ‌ని తెలిపారు. ఖ‌చ్చింతంగా ఎంత‌మంది తెలుగు వారు చ‌నిపోయారు, ఎంత మంది గాయ‌ప‌డ్డారు అనే ఖ‌చ్చిత‌మైన స‌మాచారం సేక‌ర‌ణ‌లోనే ఉన్నామ‌న్నారు..

కాగా, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేయమని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారని తెలిపారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.. క‌ట‌క్, బాలాసోర్, భువ‌నేశ్వ‌ర్, త‌దిత‌ర ప్రాంతాల‌లో రైలు ప్ర‌మాద బాధితుల‌కు ప్ర‌స్తుతం చికిత్స అందిస్తున్నార‌ని వెల్ల‌డించారు.. వారిలో ఎపి వాసులుంటే వారిని అంబులెన్స్ లు ద్వారా శ్రీకాకుళం, విశాఖ‌ప‌ట్నం ,విజ‌య‌న‌గ‌రం లోని హాస్ప‌ట‌ల్స్ కు త‌ర‌లిస్తామ‌ని పేర్కొన్నారు.. అత్య‌వ‌స‌ర వైద్య సాయం కావాల‌సిన వారిని నేడు ఎయిర్ లిఫ్ట్ ఎపికి త‌ర‌లించి చికిత్స చేయిస్తామ‌న్నారు.
రాష్ట్రానికి చెందిన వైద్యుల బృందాన్ని క్షతగాత్రులకు చికిత్స అందించడానికి పంపామని చెప్పారు. అలాగే జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. మొబైల్ ఫోన్లకు రెస్పాండ్ కాని ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని, శ్రీకాకుళం పరిసర జిల్లాలో ఉన్న ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, అంబులెన్స్‌లను ఘటనా స్థలానికి పంపించాలని సీఎం ఆదేశించారని అంటూ శ్రీకాకుళం జిల్లా నుంచి 104, 108 వాహనాలతో పాటు డాక్టర్లను ఇప్ప‌టికే ఇక్క‌డి చేరుకున్నార‌ని చెప్పారు. . క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు ఎంత ఖర్చయినా వెనకాడబోమని సీఎం చెప్పారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement