Thursday, May 2, 2024

AP: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబే సూత్రధారి.. బొత్స

విజయనగరం : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబే సూత్రధాని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… స్కిల్ డెవలప్మెంట్ లో అవకతవకలు జరిగాయని ఈడీ పేర్కొందన్నారు. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగిందన్నారు. అవినీతి చేశారు కాబట్టే అరెస్ట్ చేశారన్నారు. ఆయన తప్పు చేయకపోతే కోర్టులో తేల్చుకోవాలన్నారు. దర్యాప్తు సంస్థలు పూర్తిగా దర్యాప్తు చేసిన తరువాత మాత్రమే చంద్రబాబు అరెస్ట్ జరిగిందన్నారు. అన్ని న్యాయపరమైన అంశాలు పరిశీలించిన తరువాత మాత్రమే చంద్రబాబును అరెస్ట్ చేశారు.

అనంతరం మంత్రి విడుదల రజని మాట్లాడుతూ…. చంద్రబాబు అరెస్ట్ తప్పనిసరి పరిణామమన్నారు. చంద్రబాబు లా పరిధి దాటి ఉన్న వ్యక్తిలా అనుకుంటున్నారన్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్మార్గంగా దోచుకున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఇది తొలి అరెస్ట్ కాదు, ఇప్పటికే అనేక మంది అరెస్ట్ అయ్యారన్నారు. ఈ స్కాంలో అనేక మంది పాత్ర ఉందన్నారు. కేబినెట్ నిర్ణయానికి, అగ్రిమెంట్ కి, చెల్లింపులకి పొంతన లేవని, చంద్రబాబు ప్రభుత్వ సొమ్ము దారుణంగా దోచుకున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement